హైదరాబాద్: 28°C
తెలంగాణ

​కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

SRD:​ ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో సోమవారం ఇందువాసరే పురస్కరించుకుని అర్చకులు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు చేపట్టగా.. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.