హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామప్ప సమీపంలో బొగ్గు తవ్వకాలను అడ్డుకుంటాం

MLG: ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయ సమీపంలోని వెంకటాపూర్ వద్ద సింగరేణి చేపట్టనున్న ఓపెన్‌కాస్ట్ బొగ్గు తవ్వకాలను అడ్డుకుంటామని రామప్ప పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఆకిరెడ్డి రామ్మోహన్ రావు హెచ్చరించారు. తవ్వకాలతో ఆలయానికి, రామప్ప చెరువుకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తవ్వకాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.