GDWL: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం గద్వాల పట్టణంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ అమ్మవారు శ్రీ పార్వతీ దేవి విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఉదయం నుంచే మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ
పార్వతీ దేవి అలంకారంలో శ్రీ జమ్ములమ్మ దర్శనం


