హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనార్టీ పట్టణాధ్యక్షుడిగా ఖదీర్

KMR: కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా సయ్యద్ ఖదీర్ (సయ్యద్ మసూద్) నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఖదీర్ పేర్కొన్నారు.