ASF: దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్తున్న జిల్లా వాసులు సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కాగజ్ నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ ప్రకటనలో సూచించారు. చాలా రోజులు ఇళ్లకు తాళాలు వేసి ఉంటే దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సమాచారం ఇస్తే పెట్రోలింగ్ సిబ్బంది ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా పెడతారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
'సొంతూళ్లకు వెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి'


