హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి జూడో పోటీలు ప్రారంభం..

WGL: రాష్ట్ర 70వ పాఠశాల క్రీడా సమాఖ్య జూడో పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పోచమ్మమైదాన్ సమీపంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా అండర్‌-14 బాలబాలికలు పాల్గొన్నారు. జూడో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పేర్కొన్నారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు పాల్గొన్నారు.