WGL: గీసుకొండ మండలం కొనాయమాకుల వద్ద ఆదివారం రాత్రి కారు అగ్నికి ఆహుతైంది. నర్సంపేటకు చెందిన ప్రశాంత్ వరంగల్‌లో డీజిల్ పోయించుకుని వెళ్తుండగా ఓంకార్ గార్డెన్ వద్ద కారు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఆయన వెంటనే కారు దిగి బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు బావిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: అగ్ని ప్రమాదంలో కారు దగ్ధం..


