హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

HNK: కాజీపేట రైల్వేస్టేషన్‌ మొదటి ప్లాట్‌ఫామ్‌ చివరన గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు ఆదివారం తెలిపారు. మృతుడి వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, చామనఛాయతో 5.5 అడుగుల ఎత్తు ఉంటాడని పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు 87126 58609 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురిలో భద్రపరిచినట్లు తెలిపారు.