హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాణిజ్య ఒప్పందంతో వ్యవసాయ రంగానికి నష్టం

MHBD: బయ్యారం మండల కేంద్రంలో ఆదివారం అరుణోదయ విమలక్క పర్యటించారు. అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందంతో దేశ వ్యవసాయ రంగం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. భూమి, నీటి ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో అరెస్టు చేసిన యువతను వెంటనే విడుదల చేయాలని కోరారు.