హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రైతు వేదికల్లో రైతు నేస్తం

SRPT: మునగాల మండలంలోని మునగాల, ఆకుపాముల, రేపాల రైతు వేదికల్లో ఇవాళ ఉదయం 10 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించనున్నట్లు, మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు ఆదివారం తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో రబీ పంటల ప్రణాళికపై సీఎం ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని కోరారు.