హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్టాప్‌లో నిద్రిస్తున్న స్థితిలో వ్యక్తి మృతి

BHNG: దండు మల్కాపురంలోని ఆందోల్‌ మైసమ్మ ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం బాబా అనే వ్యక్తి మృతి చెందాడు. ఐదేళ్లుగా అనాథగా జీవిస్తూ, ప్లాస్టిక్‌ వస్తువులు సేకరించేవాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఆహారం తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు.