హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారులో అక్రమ మద్యం.. 96 బాటిళ్లు సీజ్!

MDCL: అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ అధికారులు నిఘా ముమ్మరం చేశారు. డీటీఎఫ్, కుత్బుల్లాపూర్, మాదాపూర్ ఎక్సైజ్ సిబ్బంది సంయుక్త తనిఖీల్లో కారులో మద్యం తరలిస్తున్న కే.శంకర్‌ను పట్టుకున్నారు. అతడి నుంచి 96 క్వార్టర్ బాటిళ్లు, రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కారును సీజ్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్. ఆర్. ప్రవీణ్ తెలిపారు.