హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

SRD: కరెంట్ కోతలతో హత్నూర మండలంలోని భీమ్లా తండా, దేవునిగుట్ట తండాలలో ఎండిపోతున్న వరి పంటలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్ట వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్ కోతలు విధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు.