సిద్దిపేట జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డిగ్రీ కళాశాల బహిరంగ సభలో ప్రదర్శించిన సిద్దిపేట హిస్టరీ డాక్యుమెంటరీ ఆకట్టుకుంది. 1983లో కేసీఆర్ ఎన్టీఆర్‌కు వినతిపత్రం అందించిన ఘట్టం నుంచి జిల్లా ఆవిర్భావం, నాటికీ నేటికీ జరిగిన అభివృద్ధిని దృశ్యరూపంలో చూపించారు. నాటి పోరాటాలు, ప్రగతి ప్రస్థానాన్ని ప్రతిబింబించిన ఈ చిత్రం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ
డిగ్రీ కళాశాలలో సిద్దిపేట హిస్టరీ చిత్రం ప్రదర్శన


