హైదరాబాద్: 28°C
తెలంగాణ

జమ్మలమడుగు కాలనీలో వెలగని వీధి దీపాలు

GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ ఏడవ వార్డు జమ్మలమడుగు కాలనీలో కొన్ని రోజులుగా వీధి దీపాల సమస్య తీవ్రంగా ఉంది. రాత్రి 10 గంటలు దాటినా కాలనీలోని విద్యుత్ దీపాలు వెలగడం లేదు. దీంతో కాలనీ మొత్తం చీకటిమయంగా మారి, ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.