హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాణాల శివాలయంలో గణేశ్ విగ్రహం తరలింపు యత్నం

NGKL: బల్మూరు మండలం బాణాల గ్రామంలోని శివాలయం సమీపంలో గణేష్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పడగొట్టి తరలించేందుకు యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. కొద్ది రోజుల క్రితం కూడా ఇదే విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆలయం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ, దుండగులు మళ్లీ విగ్రహాన్ని పడగొట్టడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.