KMR: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో అంతరిక్ష విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. 'ఇస్రో ఎక్స్ ప్లోరర్ విజిట్' పేరిట జిల్లాలో పదో తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల బాలికలకు ప్రతిభా పరీక్ష ద్వారా 50 మందిని ఎంపిక చేసి "ఇస్రో" సందర్శనకు తీసుకెళ్లనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
ప్రతిభ కనబరిస్తే 'ఇస్రో' యాత్రకు ఎంపిక: కలెక్టర్


