హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మాస్కులు ధరించి ATMలో చోరీ యత్నం

KMR: గాంధారిలోని SBI ATMలో చోరీ ఘటన కలకలం రేపింది. మహిళల నైటీలతో పాటు మాస్కులు ధరించిన దుండగులు సీసీ కెమెరాలపై కలర్ స్ప్రే చేసి, గ్యాస్ కట్టర్‌తో ATM యంత్రాన్ని ధ్వంసం చేసినట్లు ఫుటేజీలో వెల్లడైంది. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించగా, నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ATMలో సుమారు రూ. 25 లక్షలు ఉన్నట్లు సమాచారం.