హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రారంభమైన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు

VKB: గోకాఫసల్వాడ్ గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి విగ్రహాన్ని సర్వాంగసుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకల్లో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గామాతను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.