హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఈనెల 17 నుంచి శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం

KNR: కరీంనగర్ పద్మనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఆదివారం ఆలయ స్థలాన్ని టీటీడీ ఇంజినీర్లతో కలిసి పరిశీలించి, పనుల ప్రణాళికపై చర్చించారు. తిరుమల తరహాలో ఆలయాన్ని నిర్మించి భక్తులకు దివ్య దర్శనం కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్శనలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.