ఇండోర్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 కాసేపట్లో ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. స్టేడియంలో బౌండరీలు చిన్నగా ఉండటం, ఇరు జట్ల బ్యాటర్లు ఫామ్‌లో ఉండటంతో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో పైచేయి సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
క్రీడలు
మూడో టీ20.. పరుగుల వరద ఖాయం!


