నవరాత్రుల్లో ఉపవాసం ఉన్నప్పుడు ఖాళీ కడుపుతో ఉంటే నీరసం, తలనొప్పి వస్తాయి. దీనికి చెక్ పెట్టడానికి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగాలి. అరటి, బొప్పాయి పండ్లు, నానబెట్టిన బాదం తింటే తక్షణ శక్తి వస్తుంది. వేపుళ్లకు బదులు సగ్గుబియ్యం కిచిడీ మంచిది. షుగర్, బీపీ ఉన్నవాళ్లు మాత్రం డాక్టర్ సలహా మేరకే ఉపవాసం ఉండాలి.
ఆరోగ్యం
ఉపవాసాలతో నీరసం రాకుండా ఉండాలంటే..?


