హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మెడ నొప్పితో బాధపడుతున్నారా?

గంటల తరబడి ఫోన్ వైపు తల వంచి చూస్తే మెడపై భారీ భారం పడుతుంది. తలను 60 డిగ్రీలు వంచితే మెడపై సుమారు 27 కిలోల బరువు పడుతుందని.. దీన్నే 'టెక్స్ట్ నెక్' అంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి చెక్ పెట్టాలంటే ఫోన్‌ను కళ్ల ఎత్తులో పట్టుకోవాలి. ప్రతి అరగంటకు భుజాలు, మెడను నెమ్మదిగా తిప్పాలి. దిండు ఎత్తు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. నొప్పి తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను కలవాలి.