హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ ఊరిలో బొమ్మలకే పెద్ద పేరు..!

కృష్ణా: జిల్లా కొండపల్లి బొమ్మలు తెలుగు నేలకు గర్వకారణం. తెల్ల పొనికి అనే తేలికపాటి చెక్కతో ఈ బొమ్మలు తయారుచేస్తారు. ఏనుగు అంబారీ, దశావతారాలు, పల్లె జీవితం వీటిలో కనిపిస్తాయి. ఈ కళకు భౌగోళిక గుర్తింపు కూడా దక్కింది. దసరా బొమ్మల కొలువుల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. చేతివృత్తుల వారి కష్టానికి మనం ఇచ్చే గౌరవం వాళ్ల బొమ్మలు కొనడమే. ఈ పండగకు ఒక్కటైనా ఇంటికి తెండి.!