హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజాదర్బార్ కు 86 వినతులు

కోనసీమ: ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలో ఆదివారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి 86 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సమస్యలను అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.