హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలూరులో టీడీపీ ఆధ్వర్యంలో బీసీ సమావేశం

KRNL: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం పార్టీ టికెట్లు కేటాయించే అంశంపై ఇవాళ ఆలూరు టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి బీసీ సమావేశం నిర్వహించారు. టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అధ్యక్షత వహించి, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం, పార్టీ టికెట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఇవ్వడంపై నాయకులతో చర్చించారు.