హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరి మండలంలో టీడీపీకి షాక్

SS: కదిరి మున్సిపాలిటీ 23వ వార్డులో ఎన్. బాబా ఆధ్వర్యంలో 150 కుటుంబాలు వైసీపీలో చేరాయి. వారం క్రితం టీడీపీలో చేరిన వారు తిరిగి వైసీపీలోకి రావడంతో వార్డులో పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని నాయకులు తెలిపారు. పార్టీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్‌ జగన్‌పై ఉన్న అభిమానంతోనే తిరిగి పార్టీలో చేరినట్లు సభ్యులు పేర్కొన్నారు.