కర్నూల్ సుందరయ్య జంక్షన్‌లో సీపీఎం ఆదివారం నిరసన చేపట్టింది. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఎం నాయకులు కే. ప్రభాకరరెడ్డి డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, నిరసనకారుల అరెస్టులను ఖండించారు. ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని నిరసన


