భోజనం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. భోజనానికి ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్లు దరిచేరవు. తినడానికి 30 నిమిషాల ముందు గ్లాస్ నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. TV, మొబైల్ చూడకుండా ప్రశాంతంగా కూర్చొని ఆహారంపై దృష్టి పెట్టండి. భోజనానికి ముందు కీరదోస, క్యారెట్ వంటి పచ్చి కూరగాయలు లేదా సలాడ్ తింటే మంచిది.
ఆరోగ్యం
భోజనానికి ముందు ఇలా చేయండి!


