హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ వేదిక'

GNTR: గుంటూరు నగర ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ కె. మయూర్‌ అశోక్‌ తెలిపారు. అక్టోబర్‌ 12న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.