W.G: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో పేరుపాలెం తీరానికి తరలివచ్చారు. ముఖ్యంగా కుటుంబ సమేతంగా, స్నేహితులతో కలిసి వచ్చిన సందర్శకులతో బీచ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సముద్ర అలలతో ఆడుకుంటూ, ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు.
ఆంధ్రప్రదేశ్
పేరుపాలెం బీచ్ లో పర్యాటకుల సందడి


