హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెల్లూరు వద్ద పోలీసుల తనిఖీలు

ప్రకాశం: ఒంగోలులో నిర్వహించనున్న మహాధర్నాకు అనుమతి లేదని, ఈ నేపథ్యంలో వెల్లూరు గ్రామ సమీపంలో ఆదివారం పొదిలి సీఐ రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహాధర్నాకు వెళ్లే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.