హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మీడియా వద్దు.. ఇన్ఫ్లుయెన్సర్లు చాలు'

KKD: పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సోమవారం కాకినాడ JNTUలో CII రెండు రోజుల సదస్సు జరగనుంది. అయితే సమాచార శాఖ అధికారులు కొత్త సంప్రదాయానికి తెరతీశారు. మాకు మీడియా వద్దు, 25 మంది ఇన్ఫ్లుయెన్సర్లు వస్తున్నారు, వాళ్లు చాలు అని సమాచార శాఖ స్పష్టం చేసింది. ప్రింట్ మీడియాకు వెనక వరుసలో కుర్చీలేస్తాము, మిగిలిన వారు రానవసరం లేదు, లైవ్ లింకు ఇస్తాము అది చూసుకోండన్నారు.