KMR: రామారెడ్డి మండల కేంద్రంలో దుర్గామాత మండపాల నిర్వాహకులతో ఎస్సై మురళి శాంతి సమావేశం నిర్వహించారు. మండపాల వద్ద ఎలాంటి డీజేలు పెట్టకూడదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు పూర్తిగా పాటిస్తూ, పండుగను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల దుర్గామాత మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
తెలంగాణ
డీజేలకు నో పర్మిషన్


