హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాధన సొసైటీకి రూ.25 వేల విరాళం

సంగారెడ్డి మున్సిపాలిటీలోని విభిన్న ప్రతిభావంతుల సహాయార్థం సాధన ఎడ్యుకేషనల్ సొసైటీకి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా శాఖ రూ.25 వేల విరాళం అందించింది. కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని అందజేశారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని కలెక్టర్ ఉద్యోగులను ప్రశంసించారు.