NLG: దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలు అన్నమేరు వాగులో కలుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం గ్రామాల మధ్యగా ప్రవహించే ఈ వాగు ద్వారా కలుషిత జలాలు కృష్ణానదిలో చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: అన్నమేరు వాగులోకి వ్యర్థ జలాలు


