హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా సెలవుల్లో ఊరెళ్తున్నారా?.. ఇల్లు జాగ్రత్త!

HYD: నగరంలో దసరా సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, తాళం వేసిన ఇళ్లే దొంగల లక్ష్యమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బంగారం, నగదును బ్యాంక్ లాకర్లలో దాచుకోవాలని, ఇంటికి సెంట్రల్ లాక్‌తో పాటు సీసీ కెమెరాలు, అలారాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఊరెళ్లే ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తే ఆ ప్రాంతంలో గస్తీ ముమ్మరం చేస్తారని తెలిపారు.