హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్‌ షాక్‌తో వలస కూలీకి గాయాలు

MLG:కన్నాయిగూడెం మండలం భూపతిపురం గ్రామంలో విద్యుత్‌ షాక్‌తో జార్ఖండ్‌కు చెందిన వలస కూలీ పరవింద్‌ గాయపడ్డాడు. శనివారం విద్యుత్‌ స్తంభంపై వైర్లు సరిచేస్తుండగా షాక్‌ కొట్టి కిందపడినట్లు స్థానికులు తెలిపారు.సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితుడికి ప్రాథమిక చికిత్స అందజేసి మెరుగైన చికిత్స కోసం ఎటురూనాగారం ఆస్పత్రికి తరలించారు.