హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల డ్యాం నీటి నిల్వ వివరాలు...

జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 3.375 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ఎడమ కాలువకు 1,300, కుడి కాలువకు 725, సమాంతర కాలువకు 900, భీమా లిఫ్ట్‌-2కు 867 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో సున్నాగా ఉండగా.. ఔట్‌ఫ్లో 3,600 క్యూసెక్కులుగా నమోదైందని ఆయన వెల్లడించారు.