హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుమ్ము ధూళితో ప్రయాణికుల నరకయాతన..!

BDK: మణుగూరు అంబేద్కర్ సెంటర్ నుండి అశోక్ నగర్ వరకు దుమ్ము ధూళి తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము కారణంగా ఎదురుగా వచ్చే వాహనం కనిపించకుండా నరకయాతన అనుభవిస్తున్నట్లు ప్రయాణికులు ఇవాళ వెల్లడించారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.