హైదరాబాద్: 28°C
తెలంగాణ

శిథిలావస్థకు చేరిన పంచాయతీ కార్యాలయ తలుపులు

NRML: భైంసా మండలంలోని లింగా-1 గ్రామ పంచాయతీ కార్యాలయ తలుపులు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాలు, ఇంటి పన్నులు తదితర పనులు నిర్వహించే కార్యాలయ నిర్వహణపై అధికారులు, పాలకులు దృష్టి సారించాలని గ్రామస్థులు కోరుతున్నారు. కార్యాలయానికి మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.