హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోలిండియా బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికైన రాజు

MNCL: బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి CER క్లబ్బులో జరిగిన సింగరేణి కంపెనీ లెవెల్ బాడీ బిల్డింగ్ పోటీలలో మందమర్రి కేకే 5 గని కార్మికుడు ఇరుకుల రాజు అత్యంత ప్రతిభ కనబరిచి కోలిండియా పోటీలకు ఎంపికయ్యాడు. 80 కిలోల విభాగంలో రాజు పాల్గొన్నాడు. 55 కిలోల విభాగంలో కృష్ణ స్వామి ద్వితీయ స్థానం పొందారు. త్వరలో కోల్ ఇండియా స్థాయిలో జరిగే పోటీలలో రాజు పాల్గొంటారు.