హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పోలీస్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి'

MBNR: జిల్లాలో దసరా, నవరాత్రి వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు.మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా తెలంగాణ పోలీస్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రతీ మండపం వద్ద సీసీటీవీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయడంతో పాటు.. 24 గంటలూ ముగ్గురు వాలంటీర్లు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.