హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశం

NRPT: రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సోమవారం మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ వినీత్ సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వివిధ కేసుల వివరాలు, రికార్డులను సవివరంగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.