హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి వరకు గడువు..!

KMR: బిచ్కుంద మున్సిపాలిటీలో నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోందని జిల్లా ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 20 దరఖాస్తులు అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఈ నెల 16న కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా బార్ కేటాయింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ అధికారి తెలిపారు.