హైదరాబాద్: 28°C
తెలంగాణ

మురుగు కాల్వ నిర్మించాలని ప్రజల విజ్ఞప్తి

SRCL: వేములవాడ పట్టణంలోని మల్లారం రోడ్డులో మురుగు కాల్వలు లేక ఇళ్ల నుంచి వెలువడే మురుగు రోడ్డుపై పారుతోంది. దీంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా సమస్య కొనసాగుతున్నా కాల్వల నిర్మాణం చేపట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి మురుగు కాల్వలు నిర్మించాలని కోరుతున్నారు.