హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్వాసనతో కాలనీవాసుల అవస్థలు

JGL: కోరుట్ల పట్టణంలోని ఝాన్సీ రోడ్డులో మురుగు కాలువ దెబ్బతిని నెలలు గడుస్తున్నా అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు. కాలువ మరమ్మతుల కోసం పైకప్పును ధ్వంసం చేసినప్పటికీ మురుగు ముందుకు సాగడం లేదు. దీంతో మురుగు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోందని, కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.