PDPL: పెద్దపల్లిలో బీజేపీ గెలవకపోతే గుండు కొట్టించుకుంటానని జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవరెడ్డి సవాల్ విసిరారు. శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
'BJP గెలవకపోతే గుండు కొట్టించుకుంటా'


