హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లంపల్లి జలాశయం నీటి నిల్వ ఎంతంటే?

PDPL: అంతర్గాం శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, శనివారం సాయంత్రానికి 18.25 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి 383 క్యూసెక్కుల నీరు వస్తుండగా, హైదరాబాద్ మెట్రో తాగునీటి అవసరాలకు 262, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.