హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బుగ్గారంలో దుర్గాదేవి ఆగమన్ వేడుకలు

జగిత్యాల జిల్లా బుగ్గారంలో శ్రీ నవ దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో దుర్గాదేవి ఆగమన్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహ ఊరేగింపునకు భక్తులు ఘనస్వాగతం పలికారు. ఆధ్యాత్మిక నృత్యాలు, భక్తి పాటలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పరిసర గ్రామాల ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలు చాటుకున్నారు.